ర్యాలీకి వరణుడి అడ్డు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ర్యాలీకి వరణుడి అడ్డు..!
– వాయిదా పడిన స్వాగతం
– త్వరలో కొత్త తేది నిర్ణయం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో నేడు మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డిల కోసం చేపట్టిన ర్యాలీకి వరణుడు అడ్డుపడ్డాడు. దీంతో స్వాగత ర్యాలీని వాయిదా వేశారు. సమాచార, గనుల భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి టిక్కెట్ సాధించుకోవడం, మంత్రి, ఎమ్మెల్యేల మద్య సయోధ్య కుదిర్చిన ఎంపీ రంజిత్ రెడ్డిలు తొలిసారి తాండూరుకు వస్తున్న సందర్భంగా ఆదివారం 10 వేల మందితో భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. కాని వర్షాల కారణంగా స్వాగత ర్యాలీని వాయిదా వేసినట్లు నేతలు ప్రకటించారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ సమీపంలో సభను కూడా రద్దు చేశారు. త్వరలోనే కొత్త తేదిని నిర్ణయించి ప్రకటిస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!