తాండూరు వైద్యుడికి పదోన్నతి
– డిప్యూటీ సివిల్ సర్జన్‌గా డా. శరత్ చంద్ర
– అభినందిస్తున్న వైద్యలు, ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన వైద్యుడు డా.శరత్ చంద్ర పదోన్నతిని పొందారు. వైద్య వృత్తిలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా ప్రమోషన్ సాధించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యునిగా శరత్ చంద్ర సేవలందిస్తున్నారు. మరోవైపు పట్టణంలోని ఆదిత్య ఆసుపత్రి ద్వారా కూడా ఎంతో మంది పేదలకు చికిత్సలు అందిస్తున్నారు. చికిత్స కోసం వచ్చే రోగులు, ప్రజలతో ఎంతో అప్యాయంగా పలకిస్తూ సేవలందించడంతో స్థానిక ప్రజల్లో శరత్ చంద్రకు మంచి పేరును సంపాదించుకున్నారు. తాజాగా ఆయనకు డిప్యూటీ సివిల్ సర్జన్ గా పదోన్నతి పొందడం పట్ల తాండూరు ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు. తనకు డిప్యూటీ సివిల్ సర్జన్ గా ప్రమోషన్ రావడం పట్ల డా. శరత్ చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా వైద్యాధికారులు, తోటి వైద్యులు, నేతలు అభినందనలు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి…

