కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..!
– మొదటి రోజు సగం మంది డుమ్మా
– భయం భయంగా స్కూళ్లకు, కాలేజీలకు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభయ్యాయి. బుధవారం తాండూరులో తొలిరోజు విద్యార్థులు కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా పాఠశాల, కళాశాలలకు వచ్చారు. కరోనా నిబంధనలు అనుసరిస్తూ విద్యార్థులను అనుమతించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మాస్కులు, యూనిఫామ్స్ ధరించి వచ్చారు. తోటి విద్యార్థులు, స్నేహితులతో కలిసి ఉత్సహాంగా హాజరయ్యారు. కొన్ని ప్రవేటు పాఠశాలలో 8, 9 వ తరగతి విద్యార్థులను మాత్రమే అనుమతించారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు శానిటైజర్ వేయించి.. టెంపరేచర్ పరీక్షలు నిర్వహించారు. కళాశాలలో కూడ ఇదే వాతవరణం కనింపింది. విద్యార్థులు వెళ్లాలా వద్దా అనే సందిగ్దంలోనే హాజరయ్యారు.
సమస్యలతో స్వాగతం
మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలికారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పట్టణంలోని మల్‌రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలతో పాటు సాయిపూర్‌లోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలల ఆవరణలో బురదమయంగా మారాయి. ప్రభుత్వ నెంబర్ 1 స్కూళ్లో పరిస్థితి దారుణంగా కనిపించింది. ఓ వైపు బురదతో పాటు పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. 48 పాఠశాలలు, ఉన్నాయి.
తెరుచుకోని హాస్ఠళ్లు.. గురుకులాలు
విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైనప్పటికి గురుకుల పాఠశాలలు, కాలేజీలు, వసతి గృహాలు మాత్రం తెరవలేదు. స్కూళ్ల పునః ప్రారంభంపై హైకోర్టులో దాఖలైన ఫిటిషన్ మేరకు గురుకులాలు, వసతిగృహాల ప్రారంభంపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు,నిర్వహణలపై పూర్తి నివేధిక ఇచ్చిన తరువాతే ప్రారంభించాలని స్పష్టం చేయడంతో గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలు పునఃప్రారంభానికి నోచుకోలేదు.