మంచ్ సంస్కారం..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

మంచ్ సంస్కారం..!
– రిటైర్డ్ టీచర్లు, విద్యార్థులకు సన్మానం
– మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో టీచర్స్ డే
తాండూరు, దర్శిని ప్రతినిధి: సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలు చేపట్టే మార్వాడి యువమంచ్ తన సంస్కారాన్ని చాటుకుంటుంది. ప్రతి యేడాది టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను సన్మానిస్తోంది. ఈ సారి కూడా ఆ సంప్రదాయాన్ని పాటించింది. బుధవారం తాండూరు పట్టణంలోని శ్రీ బాలాజీ మందిర్ లోని సమావేశం మందిరంలో టీచర్స్ డే వేడులను మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.

పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడులకు తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా.జయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీచర్స్ డే సందర్భంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూత్‌తో పాటు వివిధ పాఠశాలల నుంచి రిటైర్డ్ టీచర్లు టీ. లార్దు రాజు, రాజం మరియా, పీఆర్ జసింతా, పి.అనంత్ రెడ్డి, శివరాజ్, ఉమాదేవిలను సన్మానించారు. అదేవిధంగా గ్రాడ్యూయేషన్ లో సత్తా చాటిన వినయ్ సార్డా(9.24 గ్రేడ్), సమీక్షా పర్తాని (9.19 గ్రేడ్), ఇంటర్ లో సత్తాచాటిన మాధవ్ అశ్వాహా(97.6 శాతం), ధృవ్ పర్తాని(93.83 శాతం), పదిలో ఉత్తీర్ణత సాధించిన దర్శన్ పర్తాని(89.16 శాతం), హితెన్ బూబ్ (87.5 శాతం), జయేష్ అగ్రవాల్ ( 85.6 శాతం)లను కూడా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అథితులు మాట్లాడుతూ వైద్య, విద్యారంగంలో మార్వాడి యువమంచ్ చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, రాజస్థాని ప్రగతి సమాజ్ అధ్యక్షులు రమేష్ చంద్ర సార్డా, మహిళ మండలి అధ్యక్షురాలు సంతోష్ రాఠి, మంచ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్ని అగ్రవాల్ తాండూరు అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, సభ్యులు అశిష్ సార్డా, పెద్దలు, సభ్యులు తదితరులుపాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!