పీఓపీ విగ్రహాల నిమజ్జనం నిషేధం
– ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
– తయారీదారుల పిటిషన్ వాయిదా
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: వినాయక నిమజ్జన ఉత్సవాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. వాతావరణ పరిరక్షణకు గాను పీఓపీతో తయారు చేసే విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని ఆదేశాలు జారీ చేస్తోంది. గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ ఏడాదికి కూడా కొనసాగుతాయని ఉన్నత న్యాయ స్థానం తేల్చి చెప్పింది. హుస్సేన్ సాగర్‌లో పీఓపీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని గతేడాది తెలంగాణ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. అయితే ఈ ఏడాది కూడా ఇవే నిబంధనలు కొనసాగుతాయని కోర్ట్ స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనులను ఉపయోగించాలని ఆదేశించింది.
పీఓపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ తయారీదారులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు కొట్టివేయాలన్న పిటిషనర్ల కోరికను కోర్ట్ తప్పుపట్టింది. పీఓపీ విగ్రహాల తయారీదారులు వేసిన పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 25 తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు గతేడాది వేణు మాధవ్ అనే న్యాయవాది హైకోర్ట్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ హుస్సేన్ సాగర్‌లో పీఓపీతో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు కోర్టుకు తెలిపారు. అయితే తగిన ఆధారాలతో ఎవరైనా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది.
ఇది కూడా చదవండి..

