మంత్రి మహేందర్ రెడ్డిని కలిసిన లక్ష్మారెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

మంత్రి మహేందర్ రెడ్డిని కలిసిన లక్ష్మారెడ్డి
– పుష్పగుచ్చం అందించి మంత్రికి శుభాకాంక్షలు
– చర్చనీయాంశంగా ఇరువురి భేటి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని బీజేపీ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి కలిశారు. మహేందర్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి నివాసంలో మహేందర్ రెడ్డిని లక్ష్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి మహేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించి.. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా మంత్రి మహేందర్ రెడ్డిని లక్ష్మారెడ్డి కలవడం రాజకీయ చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులకు ముందు బీఆర్ఎస్ పార్టీలో మంత్రి మహేందర్ రెడ్డి వర్గంలో లక్ష్మారెడ్డి కొనసాగారు. హఠాత్తుగా లక్ష్మారెడ్డి బీజేపీ పార్టీలో చేరారు. అయితే లక్ష్మారెడ్డి బీజేపీలో చేరడం వెనుక పొలిటికల్ గేమ్ ఉందని రాజకీయాల్లో ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో మంత్రి మహేందర్ రెడ్డిని లక్ష్మారెడ్డి కలవడం చర్చనీయాంశమైంది.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!