కాంగ్రెస్ గెలుపే ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ గెలుపే ధ్యేయం..!
– ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి
– బీజేపీతో ప్రజలకు ఒరింగిందేమి లేదు
– సోనియమ్మ సభను జయప్రదం చేయాలి
– చేవేళ్ల పార్లమెంట్ ఇంచార్జ్, గుల్బర్గా ఎమ్మెల్యే అల్లంప్రభు పాటిల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా అందరు కృషి చేయాలని ఆ పార్టీ చేవేళ్ల పార్లమెంట్ ఇంచార్జ్, గుల్బర్గా ఎమ్మెల్యే అల్లంప్రభు పాటిల్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ లాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ విజయభేరీ సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్లమెంట్ ఇంచార్జ్ అల్లంప్రభు పాటిల్ మాజీ మంత్రి వినోద్ కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లంప్రభు పాటిల్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలన వల్ల సామాన్యులకు ఒరిగిందేమి లేదన్నారు. పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతుందన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు, నేతలు పనిచేయాలన్నారు. ప్రతిపక్షాల కుట్రలను గమనిస్తూ వాటిని తిప్పికొట్టేలా పనిచేయాలన్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ. రైతు డిక్లరేషన్, దళిత డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్ లను ప్రకటించిందన్నారు. గ్యారెంటీ హామిలను ఇవ్వబోతుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 17న కాంగ్రెస్ విజయభేరి సభ, సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తోందన్నారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలు హాజరువుతున్నారని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించే సమావేశానికి తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పి.బస్వరాజ్, పెద్దేముల్ మండల, అధ్యక్షులు గోపాల్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!