మంత్రి కేటీఆర్‌తో హాది భేటీ
– ఎంఐఎం అసదుద్దీన్ సమక్షంలో కలిసిన నేత
– తాండూరు అభివృద్ధి పనులపై చర్చ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను వికారాబాద్ జిల్లా తాండూరు ఎంఐఎం పట్టణ అధ్యక్షులు హాది షహేరీ కలిశారు. మంగళవారం ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ను హాది కలిశారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ అభివృద్ధిపై ఓవైసీ సమక్షంలో మంత్రి కేటీఆర్ తో చర్చించారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో రైల్వే బ్రిడ్జి పనులు పెండింగ్ లో ఉండిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. ఇందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు హాది షహేరీ తెలిపారు. మంత్రి మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలతో చర్చించి అభివృద్ధి పనులను వేగవంతం చేయిస్తామని చెప్పినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి…

