అభివృద్ధికి బీఆర్ఎస్ సర్కారు అండ
– సీఎం కేసీఆర్ సహాకారంతో అద్భుత ప్రగతి
– రాష్ట్ర గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
– అడిగిన దానికన్న ఎక్కువ అభివృద్ధి
– ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, హాట్రిక్ సర్కారు ఖాయం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి, ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిపి పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి మహేందర్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
రూ.2 కోట్లతో బీసీ భవన్ కు శంకుస్థాపన. రాజీవ్ కాలనీ సమీపంలో రూ. 2.35 కోట్లతో హిందూ, ముస్లింల స్మశాన వాటికలకు శంకుస్థాపన, వికారాబాద్ – తాండూరు రోడ్డు మార్గంలో రూ.16 కోట్లతో స్టోమ్ వాటర్ డ్రైన్‌కు కు శంకుస్థాపన. అంతారంలో రూ. 12.26 కోట్లతో 12 ఎకరాల్లో ఆటోనగర్ కు శంకుస్థాపన, రూ.2 కోట్లతో బంజార భవన్, క్రిస్టియన్ భవన్ లకు శంకుస్థాపన, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన, ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద నీటి సరఫరా మెరుగు పథకానికి శంకుస్థాపన, పాత తాండూరులో రూ. 74 కోట్లతో చేపట్టే రైల్వే అండర్ బ్రిడ్జికి శంకుస్థాపన, పాత తాండూరులోని మైనార్టీ భవనానికి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధిని చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ సర్కారు అండగా నిలుస్తోందన్నారు. తాండూరులో పెండింగ్ లో ఉండి పోయిన రైల్వే బ్రిడ్జి ప్రారంభం, ఆటో నగర్, బీసీ భవన్, బంజార భవన్, క్రిస్టియన్ భవన్ లు ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు.

అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రజలకు ఇచ్చిన హామిలతో పాటు అడగని అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నామన్నారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జి, బీసీ భవన్, బంజార, క్రిస్టియన్ భవన్ లతో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం జరిగిందన్నారు. దీంతో పాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపును, హ్యాట్రిక్ సర్కారును ఎవ్వరు ఆపలేరన్నారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు ఎంపీపీ అనితా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల నర్సింలు, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, సంగీత ఠాకూర్, విజయాదేవి, బంటారం లావణ్య, బోంబీనా, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ (నయూం), మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్, అంతారం సర్పంచ్ రాములు, అంతాంతం తాండా సర్పంచ్ సావిత్రి బాయి, ఎంపీటీసీ శాంతు, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, మహిళ అధ్యక్షురాలు జ్యోతి, బస్సు, పార్టీ నాయకులు, ఆయా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

