ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయూత

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయూత
– ఆర్బీఎల్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
– ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో బోర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాడికల్ బయో ఆర్గానిక్ లిమిటెడ్(ఆర్బీఎల్) ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి చేయూతనందిస్తున్నారు. సమాజ సేవలో భాగంగా సమస్యలు ఉన్న పాఠశాలలను గుర్తించి తమ వంతు ఆర్థిక సాయం అందిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సోమవారం తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.92 వేలతో బోరు వేయించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమాజ సేవలో తమ వంతు బాధ్యతగా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు సహకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహాయం చేయాలన్న ఉద్దేశంతో తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఉన్నత పాఠశాలలో బోరుతో పాటు విజయ విద్యాలయ స్కూల్లో మౌలిక సదుపాయాలకు రూ.1.50 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. రూ.30 లక్షలతో యాలాల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తామని తెలిపారు.

ఎంఈఓ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల బలోపేతానికి తెలంగాణ సర్కార్ మన ఊరు మనబడి కార్యక్రమాలను చేపట్టి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. సమాజంలోని దాతల సహకారంతో మరింత అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. నీళ్ల సమస్యను శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే బోరు వేయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు