జయహో.. బీసీ సేవకులు..!
– దేశ రాజధానిలో జాతీయ పురస్కారాలు
– అందుకున్న కందుకూరి రాజ్ కుమార్, పర్యాద రామకృష్ణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన బీసీ సేవకులు జయహో.. అనిపించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, భాష్యం కాలేజీకి చెందిన పర్యాద రామకృష్ణలు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బీసీ సేవకులు రాజ్ కుమార్, పర్యాద రామకృష్ణలు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
గత 30 ఏండ్లుగా బీసీల చైతన్యానికి, బీసీ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న కందుకూరి రాజ్ కుమార్ కు మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ పురస్కారం, విద్యారంగంలో, సామాజిక ఉద్యమాల్లో ముందుంటూ మహనీయుల భావజాల వ్యాప్తికి, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న పర్యాద రామకృష్ణకు జాతీయ విద్యారత్న పురస్కారాలను ప్రదానం చేశారు.
బహుజన సాహిత్య అకాడమి బహుజన రైటర్ 4వ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథులుగా హాజరైన బహుజన రాజ్యాధికారి పితామహుడు మాన్యవర్ కాన్సీరాం సోదరి స్వర్ణ కౌర్, ఢిల్లీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ జీ, బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షులు వల్ల రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ మల్లేశ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్ ల చేతుల మీదుగా ఈ జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ పురస్కారాలను అందుకోవడం పట్ల రాజ్ కుమార్, పర్యాద రామకృష్ణలు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు తాండూరు ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి..
https://dharshininews.com/21110/

