బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం
– 23వ వార్డులో పార్టీ కార్యాలయం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతోందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని 23 వ వార్డులో బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, ఎమ్మెల్యే సతీమణీ ఆర్తిరెడ్డి, తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్యతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలనను అందిస్తున్నారని అన్నారు. మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అందరు బాధ్యతగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ కన్వినర్ శకుంతల, వాల్మీకీ నగర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయ చైర్మన్ దర్మీది రవి చంద్రకళ, వార్డు ప్రెసిడెంట్ కల్వ రాజవంశి, వార్డు సభ్యులు మంజుల, కవిత, మణికంఠ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

కాంగ్రెస్ ను ‘గ్యారెంటీ’గా నమ్మరు..!