కాంగ్రెస్ను గెలిపించుకు తీరుతాం..!
– లోకల్ అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలి
– యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అమేర్ అబ్దుల్లా
– తాండూరులో గ్యారెంటీ పథకాలపై పాదయాత్ర
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని తీరుతామని యూత్ కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అమేర్ అబ్దుల్లా అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పథకాలపై పట్టణంలో ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్ నుంచి మార్వాడి బజార్, భద్రేశ్వర చౌరస్తా, గాంధీ చౌరస్తాలలో ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో తాండూరు నియోజకవర్గ అసెంబ్లీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అమేర్ అబ్దుల్లా పాల్గొన్నారు. ర్యాలీ కొనసాగిన మార్గంలో ప్రజలకు, వ్యాపారులకు కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలపై ప్రచారం చేశారు. గాంధీ చౌరస్తాలో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు.
అనంతరం సమద్ ఫంక్షన్ హాల్ లో అమేర్ అబ్దుల్లా • మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ అధినేత్రి ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలతో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాండూరులో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామన్నారు.
గ్యారెంటీ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నామన్నారు. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానికత కోటాలో టిక్కెట్ కేటాయించాలన్నారు. లేకున్నా అధిష్టానం ఎవ్వరికి టిక్కెట్ ఇచ్చినా గెలుపుకు పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ లింగదళి రవికుమార్, సయ్యద్ షుకూర్, ష బ్బీగ్, నవాజ్, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

