ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం నుంచి కాపాడండి
– చైర్‌పర్సన్, ఇంచార్జ్ కమీషనర్‌కు కోఆఫ్షన్ మెంబర్ బి.ఉశ వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడలని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌తోపాటు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌లకు సీనియర్ కోఆప్షన్ సభ్యురాలు బిర్కట్ ఉశ వినతిపత్రం అందజేశారు. శనివారం ఏర్పాటు చేసిన మున్సిపల్ అత్యవసర
సమావేశంలో వినతిపత్రం అందించారు. మున్సిపల్ పరిధి వార్డు నెంబర్ 20 గాంధీనగర్‌లో 6-8-19 గల ఇంటిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. వారిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గతంలో అనగా 2019 జనవరిలో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. ఇప్పటికి దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టాలేదని, ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం నుంచి కాకుండా కాపాడాలని కోరారు.
