ఆంజనేయ ఆలయ నిర్మాణానికి తోడ్పాటు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఎమ్మెల్యేను కలిసిన అంతారం గ్రామస్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతారం గ్రామస్తులు తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాములు, ఎంపీటీసీ శాంతుల ఆధ్వర్యంలో గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే రోమిత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ఆలయ నిర్మాణానికి తనవంతు ఆర్థిక సాయం, తోడ్పాటు అందిస్తానని హామి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి డైరెక్టర్ ఎం.ప్రకాష్, ఉపసర్పంచ్ జీవరత్నం, వార్డు సభ్యులు రాజేందర్ రెడ్డి, ఆలయ కమిటి అధ్యక్షులు పుల్లా ప్రభాకర్ రెడ్డి, యువసేన అధ్యక్షులు చల్లా శ్రీనివాస్, కమిటి సభ్యులు వడ్డె కృష్ణ, పీసుల రవి, ప్యాట బాలప్ప, రాజు, అజయ్, ముడుగుల సాయిలు, దొగల రాజు, వడ్డె వెంకట రాములు, చుక్కుల హన్మంతు, మాజీ వార్డు సభ్యులు కుర్వ లక్ష్మప్ప, కేసీ కోటప్ప, వడ్డె గోపాల్, కాసుల నారాయణ, శేరి విజయేందర్ రెడ్డి, కుర్వ భరత్, కేసీ మల్లప్ప, బుర్ర రాములు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

