ఊపందుకున్న నామినేషన్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఊపందుకున్న నామినేషన్లు
– నాలుగో రోజు 5 నామినేషన్లు
– ప్రకటించిన ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు
– పార్టీ నుంచి, స్వతంత్రంగా ఎవరెవరు వేశారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈనెల 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో రోజు మొదటి నామినేషన్ బుయ్యని మనోహరెడ్డి వేశారు. నిన్న ఆదివారం ఎవ్వరు నామినేషన్ వేయలేదు. నాలుగో రోజు సోమవారం 5 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగో రోజు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి బోయిని చంద్రశేఖర్, ధర్మ సమాజ్ పార్టీ. (డీఎస్పీ) నుంచి గౌరీ శ్రీశైలంలు పార్టీల నుంచి నామినేషన్లు సమర్పించారని తెలిపారు.

అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్, శ్రీ గోపాల్. బీ.రాములు నామినేషన్లు సమర్పించారని తెలిపారు. ఇప్పటి వరకు తాండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 6 నామినేషన్లు సమర్పించినట్లు రికార్డు అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ మహేష్‌ గౌడ్, బీఎస్పీ నాయకులు ప్రభుకుమార్, సత్యమూర్తి దోరశెట్టి, అంజద్ అలీ, అరుణ్‌ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..