పైలెట్‌ నామినేషన్‌కు ముహుర్తం ఖరారు

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్‌ నామినేషన్‌కు ముహుర్తం ఖరారు
– నేడు దాఖలు చేయనున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఏర్పాట్లు చేస్తున్న నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు జోరుగా వేసుకుంటున్నారు. ఇదివరకు కాంగ్రెస్‌ నుంచి బుయ్యని మనోహర్ రెడ్డి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. తాండూరులో ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య పోటీ ఉంది. నామినేషన్ దాఖలులో కాంగ్రెస్‌ పార్టీ ప్రక్రియను పూర్తి చేయగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వంతు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పైలెట్ రోహిత్ రెడ్డి నామినేషన్ ఎప్పుడు దాఖలు చేస్తారో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. రేపు గురువారం నామినేషన్ వేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. మంగళవారం తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌లో వెలసిన శ్రీదేవి భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు కూడా నిర్వహించారు. బుధవారం తాండూరు ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పార్టీ శ్రేణులు కూడా అట్టహాసంగా జరిపేందుకు సిద్దమయ్యారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..