పైలెట్ గెలుపే లక్ష్యం..!
– భారీ మెజార్టీని అందిద్దాం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
– పెద్దేముల్ మండలంలో విస్తృత ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పైలెట్ గెలుపే లక్ష్యంగా అందరు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం పెద్దేముల్ మండలం గాజీపూర్, గొట్లపల్లి, ఇందూరు, ఆత్కూర్’ తదితర గ్రామాల్లో బీసీ సంఘం, రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తరుపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ బీఆర్ఎస్ మెనిఫెస్టోను గ్రామాల్లో ప్రజలకు అందించి, ఎమ్మెల్యేకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ సర్కారు సహాకారంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరులో బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాండూరులో బీసీ సమీకృత భవన్ నిర్మాణానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు భారీ మెజార్టీ అందించి గెలిపించడమే లక్ష్యంగా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, సర్పంచులు వీరప్ప, శాంతప్ప, బీసీ సంఘం పెద్దేముల్ మండల అధ్యక్షులు బసంత్ కుమార్, శ్రావణ్ కుమార్, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, యువనాయకులు రాము ముదిరాజ్, దుబాయి వెంకట్, నరేష్ గౌడ్, మహేష్, నరేష్, సురేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

