సంక్షేమం రోహిత్ రెడ్డి తోనే సాధ్యం..!
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
– బషీరాబాద్ మండలంలో విస్తృత
ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సబ్బండ వర్గాల సంక్షేమం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బషీరాబాద్ మండలంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలోని జీవన్గి, క్యాద్గీర్, గంగ్వార్ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు చేయలేని విధంగా తాండూరులో బీసీ సమీకృత భవనం ఏర్పాటుకు కృషి చేశారని సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ఆలోచన చేసే వ్యక్తి పైలెట్ రోహిత్ రెడ్డి అని అలాంటి వ్యక్తిని బీసీ కులాలకు చెందిన అన్ని వర్గాల వారు పైలట్ రోహిత్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుందామని గ్రామ యువకులు, మహిళలు, పెద్దలకు రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ శకూర్ జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్ బషీరాబాద్ బీసీ మండల అధ్యక్షులు నరేందర్, జీవన్గీ ఉప సర్పంచ్ జగదీష్, తాండూర్ బీసీ మండల అధ్యక్షులు బసంత్ కుమార్, ముదిరాజ్ సంఘం కార్యదర్శి రాము ముదిరాజ్, బీసీ సంఘం నాయకులు దుబాయ్ వెంకట్, హరిప్రసాద్, క్యాద్గిరా శ్రీనివాస్, నాగరాజు, అనిల్, హనుమంతు, సోఫియాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..

