కేసీఆర్ రుణం తీర్చుకోవాలి..!
– వికలాంగులకు ఫించన్ పెంపు కేసీఆర్ ఘనతే
– బయటోళ్లను నమ్మి ఆగం కావొద్దు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్షిని ప్రతినిధి : దేశంలో ఎక్కడాలేని విధంగా వికలాంగులకు ఫించన్ అందిస్తున్న సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి తాండూరులోని ఓ వేదికలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వికలాంగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. తెలంగాణలో వికలాంగులకు రూ.3వేలు ఉన్న ఫించన్‌ను సీఎం కేసీఆర్ రూ.4 వేలకు పెంచారని గుర్తుచేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే దానిని రూ. 6 వేలకు పెంచాలని నిర్ణయించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వికలాంగులకు అధిక ఫించన్ అందిస్తున్న ఘతన సీఎం కేసీఆర్ దే అని అన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో ఇచ్చే రూ.1 వెయ్యి పెంచన్ కే మెలికలు పెట్టి ఇస్తున్నారని విమర్శించారు. తాండూరులో బయటి వ్యక్తులను నమ్మి ఆగం కావొద్దని అన్నారు. సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలంటే కారు గుర్తుకు ఓటేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, వికలాంగుల సంఘం నాయకులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు

