కాంగ్రెస్ పార్టీకి షాక్..!
– కారెక్కిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎంఏ అలీం
– గులాబీ కండువా వేసుకున్న మైనార్టీ నాయకుడు
– ఆహ్వానించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, మైనార్టీ నాయకులు బషరత్ అలీ తదితరులు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం తాండూరు పట్టణంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో వారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎంఏ అలీంతో పాటు బేషరత్ అలీ తదితరులు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. అదేవిధంగా పార్టీలో చేరిలో నేతలు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామన్నారు.
పార్టీలో చేరిన వారిలో సుల్తాన్ భాయ్, నవాబ్ భాయ్, ఇస్మాయిల్ ఖాన్, ముజాఫర్, మోయిజ్, బషీర్ భాయ్, ఖయ్యూం ఖురాన్, జహాంగీర్, సత్తార్, మహిళ నాయకురాలు రేణుక తదితరలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ముస్తఫా పటేల్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి..

