బీఆర్ఎస్ పార్టీకి షాక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ పార్టీకి షాక్..!
– హస్తం గూటికి సంగెంకలాన్ సర్పంచ్
– కాంగ్రెస్‌లో చేరిన మల్కాపూర్ మాజీ ఎంపీటీసీ
-ఆహ్వానించిన డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం తాండూరు మండలంలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాలు జరిగాయి. సంగెంకలాన్ గ్రామంలో జరిగిన ప్రచారంలో తాండూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా మల్కాపూర్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ రఘునాథ్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

ప్రచారానికి హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి హస్తం గూటికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ హామీలు ఇచ్చి నెరవేర్చని బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదరణతో బీఆర్ఎస్ పార్టీకి భయం పుట్టిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవ్వరు ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్. లక్ష్మారెడ్డి, ఉమ్మడి జిల్లా: డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, ఎల్మకన్నె సహాకార సంఘం మాజీ చైర్మన్ నారాయణ గౌడ్, మండల పార్టీ. అధ్యక్షులు జె. నాగప్ప, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్, సీనీయర్ నేతలు జనార్ధన్ రెడ్డి, గుర్రంపల్లి రాందాస్, ఎంపీటీసీ రాజ్ కుమార్, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..