ముదిరాజ్‌ల మద్దతు బీఆర్ఎస్ కే..!
– రేపు తాండూరుకు కాసాని జ్ఞానేశ్వర్ రాక
– మూడో సారి సర్కారు, రెండోసారి పైలెట్‌కు సపోర్టు
– ముదిరాజ్ మహాసభల జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకే ముదిరాజ్‌ల మద్దతు ఉంటుందని ముదిరాజ్ మహాసభల జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ అన్నారు. మంగళవారం తాండూరుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాండూరులో నిర్వహించిన ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనానికి వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోయామని తెలిపారు. తాండూరులో రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డికి గతంలో కాసాని జ్ఞానేశ్వర్ స్థాపించిన మన పార్టీ ద్వారా అవకాశం ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ లకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ముదిరాజ్, బీసీ, సబ్బండ వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఎన్నికల తరువాత బీసీ సబ్బండ వర్గాలకు అన్యాయం జరగకుండా ముదిరాజ్ లను బీసీ డీ నుంచి ఏ లోకి మార్చే విధంగా కృషి చేస్తామని సీఎం కేసీఆర్ భరోసా అందించారని తెలిపారు. ముదిరాజ్ ల డిమాండ్లను సాధించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సహాకారం ఉంటుందన్నారు. అందుకనే రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో కీలకంగా నిలిచే ముదిరాజ్ మద్దతు బీఆర్ఎస్ కు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా తాండూరులో ముదిరాజ్ లు, బీసీ సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు ముదిరాజ్ ల మద్దతు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ లకు ఒక్క సీటు కూడ ఇవ్వలేదని ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేశారు. కొన్ని చోట్ల అనివార్య కారణాల వల్ల అభ్యర్థులు దూరం కావడం జరిగిందన్నారు. వచ్చే మున్సిపల్, కార్పోరేట్, ఇతర ఎన్నికల్లో ముదిరాజ్ లకు ప్రాధాన్యమివ్వడం జరుగుతుందన్నారు.

మరోవైపు నేడు తాండూరు పట్టణంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ తో పాటు కాసాని జ్ఞానేశ్వర్ కూడా విశిష్ట అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు: ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపుకు ముదిరాజ్ లు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్, బీఆర్ఎస్ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, మాజీ అధ్యక్షురాలు అనురాధ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, ముదిరాజ్ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఆకుల రాములు, ఎస్పీ రవికాంత్, బీఆర్ఎస్ నాయకులు రవీందర్, టైలర్ రమేష్. బీసీ సంఘం, ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

