బీఆర్ఎస్సే గిరిజనులకు అండ దండ

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్సే గిరిజనులకు అండ దండ
– రోహిత్ రెడ్డి కృషితో బంజారుల సంక్షేమం
– మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– మండలంలో పైలెట్ గెలుపు కోసం ప్రచారం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని గిరిజనులకు అండ దండలు అందిస్తుందని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. ఆదివారం తాండూరు మండలం ఓగిపూర్ గ్రామ శివారుంలోని గిరిజన తాండాల ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డితో కలిసి విఠల్ నాయక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి చేయూతనిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేసి గిరిజనులను సర్పంచులుగా మార్చిందన్నారు. ప్రస్తుతం గిరిజనులకు ఉన్న6 శాతం రిజర్వేషన్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 శాతంకు పెంచేందుకు దృష్టిసారించిందన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

తాండూరులో బంజార భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని గుర్తుచేశారు. దీంతో పాటు తాండాలలో సేవాలాల్ మహరాజ్, గిరిజనుల ఆరాధ్య దైవం భవానీ మాత, మరియమ్మల విగ్రహాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, హేమంత్ కుమార్, ఈశ్వర్, సురేష్, చంద్రకాంత్, ప్రేమ్ కుమార్, రమేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!