మనోహర్ రెడ్డి రాజీనామా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మనోహర్ రెడ్డి రాజీనామా..!
– 13న లేఖ అందించనున్న ఎమ్మెల్యే
– ఆయన పదవిపై నేతల ఆశలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అదేంటీ… ఎమ్మెల్యేగా గెలిచిన మనోహర్ రెడ్డి రాజీనామా చేస్తున్నారా.. అనే అనుమానాలు వస్తున్నాయి కదా. అవును మీరు చదివించి నిజమే. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాజీనామాకు సిద్దమయ్యారు. మీరు అనుకుంటున్నట్లు ఎమ్మెల్యే పదవి కాదు. ఎన్నికల ముందు కూడా మనోహర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డీసీసీబీ చైర్మన్ పదవిలో ఉండగానే ఆయన తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డిపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తన డీసీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈనెల 13న డీసీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో మనోహర్ రెడ్డి వదులుకుంటున్న డీసీసీబీ చైర్మన్ పదవిపై ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డిలు ఆశలు పెట్టుకున్నారు. అయితే డీసీసీబీ చైర్మన్ పదవిని ఇచ్చేట్లు చేస్తే పార్టీలో చేరుతానని రవీందర్ గౌడ్ ఖండిషన్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. వీరితో పాటు పరిగి ప్రాంతానికి చెందిన నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మనోహర్ రెడ్డి నేడు తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!