మరో ఐదేళ్లు రేషన్ ఫ్రీ..!

ఆరోగ్యం జాతీయం టెక్నాలజీ తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మరో ఐదేళ్లు రేషన్ ఫ్రీ..!
– ఆహార భద్రత బియ్యం పంపిణీ పొడగింపు
– ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: దేశంలోని పేదలకు మరో ఐదేళ్లు రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. కరోనా కాలం నుంచి ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ద్వారా రేషన్‌ కార్డుదారులకు అందిస్తున్న ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ గడువు ఈ నెలతో ముగుస్తొంది. ఈ నేపథ్‌యంలో ఉచిత బియ్యం పంపిణీనీ మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గతేడాది వరకు విడతల వారీగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ వచ్చిన కేంద్రం.. 2022 మార్చిలో ఆరు నెలలు పెంచింది. ఆ తర్వాత మరో మూడు నెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయింది.

అదే ఏడాది చివర్లో కార్డులోని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందించాలని నిర్ణయించి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నెలతో అది కాస్త ముగుస్తుండటంతో మరోసారి 2024 నుంచి ఐదేళ్ల పాటు ఆరు కిలోల బియ్యం చొప్పున అందించేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. ఆహార భద్రత కార్డుదారులకు యూనిట్‌కు 6 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో పేదలకు ఎంతో లబ్ది చేకూరుతోంది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!