ప్రజా సంక్షేమానికి సర్కారు కృషి
– ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
– ప్రజా, పాలనలో దరఖాస్తులు చేసుకోవాలి.
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– తాండూరులో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని 2వ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిందన్నారు.
మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.2500ల ఆర్థిక సాయం, రూ. 500లకు గ్యాస్ సిలిండర్, రైతు భరోసా కింద రైతు, కౌలు రైతులకు రూ. 15వేల సాయం, కూలీలకు ఏటా రూ.12 వేల సాయం, ఇందిరమ్మ పథకం కింద నిరుపేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం, గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్, చేయూత కింద ఫించన్ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తామన్నారు. అర్హులైన వారు తెల్ల రేషన్ కార్డు లేకున్నా అర్హులైన వారు దరఖాస్తుల చేసుకోవాలన్నారు. డబ్బులకు ఫారాలను విక్రయిస్తున్నారని చేస్తున్న అపోహలను సమ్మొద్దని సూచించారు. తప్పిన వారికి కూడా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆరు గ్యారెంటీలను బాధ్యతగా అమలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఫ్లోర్ లీడర్ మధుబాల, పట్టణ మాజీ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ బోయరవి, ప్రత్యేకాధికారి వినయ్ కుమార్, మున్సిపల్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

