ప్రజా పాలనకు ఫుల్ రెస్పాన్స్..!
– మున్సిపల్ 1915 దరఖాస్తులు
– రాత్రి వరకు స్వీకరించిన అధికారులు
– ఎక్కడెక్కడ ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే గురువారం పట్టణంలోని 1వ వార్డు నుంచి రవ వార్డు వరకు మూడు ప్రత్యేక బృందాలతో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. మొదటి రోజు ఆయా వార్డుల్లో లబ్దిదారులు ఐదు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు సమర్పించుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మున్సిపల్ ప్రత్యేకాధికారి వినయ్ కుమార్, కమిషనర్ షఫీఉల్లాలు పర్యవేక్షించారు.
ఉదయం 1వ, 2వ, 3వ వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగగా మధ్యాహ్నం 4వ, 5వ, 6వ వార్డులలో కొనసాగింది. 6వ వార్డులో రాత్రి వరకు లబ్దిదారులు దరఖాస్తులు సమర్పించారు. ఆలస్యమైనా అధికారులు ఓపికతో దరఖాస్తులను స్వీకరించారు. 1వ వార్డులో 417, 2వ వార్డులో 341, 3వ వార్డులో 341, 4వ వార్డులో 252,5వ వార్డులో 324, 6వ వార్డులో రాత్రి వరకు 240 నమోదు కాగా దరఖాస్తులు దారులు సమయం దాటిన బారులు తీరారు. దీంతో మొదటి రోజు నిర్ణీత సమయానికి మొత్తం 1915 దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి…

