దైవ దర్శనంలో దుర్ఘటన
– చెరువులోకి దూసుకెళ్లిన ఆటో
– నీటిలో మునిగిన భక్తులు
– డ్రైవర్ కుమారుడి పరిస్థితి సీరీయస్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : దైవ దర్శానికి తిరిగి గ్రామానికి బయల్దేరిన ఆటో చెరువులోకి తీసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో భక్తులతో పాటు ఆటో డ్రైవర్ కుమారుడు నీటిలో మునిపోయారు. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లి, అంతారం తాండా మార్గంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా దోమ మండలం రాయికోండ గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన ఆటోలో కుటుంభీకులు, బందువులలో 10మందితో కలిసి తాండూరు పట్టణంలోని మల్ రెడ్డి పల్లి చెరువు కట్ట మీదుగా తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ దేవాలయానికి దర్శనానికి వచ్చారు.
దర్శనం అనంతరం తిరిగి గ్రామానికి బయల్దేరారు. మార్గ మద్యలోని మల్ రెడ్డిపల్లి చెరువు కట్టకు వద్దకు రాగానే వేగంగా వెళుతున్న ఆటో అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వారందరు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు. అందరికి ప్రాణాపాయం తప్పింది. కాని ఆటో డ్రైవర్ శ్రీనివాస్ కుమారుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు కుటుంభీకులు తెలిపారు. న్యూ ఇయర్ రోజున జరిగిన ఈ సంఘటన విచారాన్ని నింపింది.
ఇది కూడా చదవండి…

