అంగరంగ వైభవంగా అయోధ్య ఉత్సవాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

అంగరంగ వైభవంగా అయోధ్య ఉత్సవాలు
– తాండూరులో ఉప్పొంగిన భక్తిభావం
– వాడ వాడల రామ జపం, పూజలు
– గోశాలలో వెల్లివిసిరిన అధ్యాత్మికత
– కమణీయంగా సీతారాముల కళ్యాణం
– పాల్గొన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో అయోధ్య భవ్య రామ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా తాండూరు మొత్తం రామ నామంతో మార్మోగింది. భజే.. భజే.. రామం భజే అంటూ కీర్తనలతో పట్టణం మొత్తం ఆధ్యాత్మిక భావనతో నిండిపోయింది. పట్టణంలోని గోశాల సేవా సమితిలో ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. అదేవిధంగా ఇందిరా నగర్ రాంమందిర్, మల్ రెడ్డిపల్లి అంజనేయ స్వామి దేవాలయం, సీతారాం పేట్ హనుమాన్ దేవాలయం, స్టేషన్ హనుమాన్ దేవాలయం, పాత తాండూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం, హనుమాన్ దేవాలయం, సాయిపూర్ హనుమాన్ దేవాలయం. కన్యాపాఠశాల వద్ద ఉన్న హనుమాన్ దేవాలయాల వద్ద కళ్యాణోత్సవాలు, అభిషేకాలు కన్నుల పండుగలా నిర్వహించారు. గోశాలలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవం చూడ ముచ్చటగా జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. గోశాలలో అయోధ్య ఉత్సవాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

దేవాలయాల వద్ద ఎల్ఈడీల ప్రదర్శన
అయోధ్యలో వందల ఏళ్లనాటి కలను సాకారం చేస్తూ చేపట్టిన రామ విగ్రహ ప్రతిష్టాపన, దేవాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని దేవాలయాల వద్ద ఎల్ఈడీల ప్రదర్శన ఏర్పాటు చేశారు. సుహుర్తములో ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన మహోన్నత ఘట్టాన్ని భక్తజనమంతా వీక్షించారు. తమ అంతరంగంలో రామున్ని తలుచుకుని జై శ్రీరామ్ నినాదాలు చేశారు. అయోధ్యలో కొలువుదీరిన రాముని ప్రతిరూపాన్ని దర్శించుకున్నారు.

దర్శించుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
తాండూరులోని గోశాలల్లో నిర్వహించిన అయోధ్య ఉత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు ఒకేసారి పాల్గొనడం ఆకర్షణీయంగా నిలిచింది. ఇద్దరు ఒకేసారి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు సీతారాములను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన అయోధ్య ఉత్సవాలలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు వేరు వేరుగా పాల్పంచుకున్నారు.

ఇంటింటా పూజలు
మరోవైపు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలోని హిందువుల ఇండ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామ ఉత్సవాలను పండగలా జరుపుకున్నారు. ఉదయం నుంచే తమ తమ ఇండ్లలో రాముని చిత్రపటాలను ఉంచి పూజలు నిర్వహించారు. మందల ఏండ్ల కల సాకారం కావడం పట్ల అయోధ్య ఉత్సవాలను ఉత్సహాంగా జరుపుకున్నారు. అనంతరం పట్టణంలో దేవాలయాల వద్ద జరిగిన ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు.

వాడ వాడల ఉత్సవాలు
తాండూరు పట్టణంలోని వాడ వాడలా అయోధ్య ఉత్సవాలు అట్టహాసంగా జరుపుకున్నారు. దేవాలయాల వద్ద ప్రత్యేక మందిరాలను ఏర్పాటు చేసి శ్రీరామునికి పూజలు.. నిర్వహించారు. సీతారాములకు అభిషేకాలు నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాలు జరింపిచారు. అనంతరం పలు ప్రాంతాల్లో భక్తులకు అన్నదానాలు నిర్వహించి శ్రీరామునిపై భక్తిని చాటుకున్నారు. అంతకుముందు తాండూరు పట్టణంలోని పురవీధుల్లో కాషాయా జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించారు.

భక్తి శ్రద్ధలతో గాయత్రి మహాయజ్ఞం
తాండూరు పట్టణంలోని ఆర్య సమాజ్లో మహా యజ్ఞాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయోధ్య రామ ప్రతిష్టను పురస్కరించుకుని నగరేశ్వర దేవాలయంలోని ఆర్య- సమాజ్లో 48 జంటల దంపతులతో విశ్వ కళ్యాణ గాయత్రి మహ యజ్ఞాలను పూర్తి చేయించారు. ఉదయం నుంచి ఆర్య సమాజ్ యజ్ఞాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!