బీఆర్ఎస్, ఎంఐఎంలకు షాక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్, ఎంఐఎంలకు షాక్..!
– హస్తం గూటికి వచ్చిన ఇద్దరు కౌన్సిలర్లు
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని బీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీలకు షాక్ తగిలింది. ఆయా పార్టీలకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో వీరి చేరిక జరిగింది. ఈ చేరిక పర్వం బుధవారం రాత్రి జరిగింది. తాండూరు మున్సిపల్ పరధి 8వ వార్డు రాజీవ్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్‌గా వెంకన్న గౌడ్ కొనసాగుతున్నారు. మొదట ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గంలో ఉన్న ఆయన తరువాత మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంలో చేరారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరుపున 14వ వార్డు నుంచి పోటీ చేసిన బొంబీనా విజయం సాధించి కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.

అయితే బుధవారం రాత్రి అనూహ్యంగా వారు పార్టీలను వీడారు. బీఆర్ఎస్ నుంచి వెంకన్న గౌడ్, ఎంఐఎం పార్టీ నుంచి బొంబీనాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కౌన్సిలర్లతో పాటు ఎంఐఎం యువనాయకుడు రవూఫ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు మున్సిపల్ పరిధిలో మొదట నలుగురు కౌన్సిలర్లుగా ఉన్న సంఖ్యా బలం ప్రస్తుతం 10 మందికి చేరింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళి గౌడ్, అబ్దుల్ రవూప్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, మక్సుద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!