బీజేపీ జిల్లా కార్యవర్గం ఖరారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీ జిల్లా కార్యవర్గం ఖరారు..!
– ప్రకటించిన జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి
– జిల్లా ఉపాధ్యక్షులుగా అంతారం లలిత, బాలి శివకుమార్
– తాండూరు నుంచి మరికొంత మంది నేతలకు ప్రాధాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ వికారాబాద్ జిల్లా కార్యవర్గం ఖరారయ్యింది. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు కె. మాధవ రెడ్డి జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా అంతారం లలిత(తాండూరు), బాలి శివకుమార్ (తాండూరు), రాజేందర్ రెడ్డి(వికారాబాద్), రాము యాదవ్ (పరిగి), కేశవులు (దోమ), రాములు (వికారాబాద్), శ్రీధర్ రెడ్డి(వికారాబాద్), ప్రధాన కార్యదర్శులుగా కృష్ణముదిరాజ్(తాండూరు), విజయ్ భాస్కర్ రెడ్డి(వికారాబాద్), రాంచెందర్ (పరిగి)లను ఎన్నుకున్నారు.

అదేవిధంగా కార్యదర్శులుగా బంటారం భద్రేశ్వర్(తాండూరు), విజయ్ రాజ్(వికారాబాద్), సార జగన్ (నవాబ్ పేట్), మల్లేశ్ యాదవ్ (మర్పల్లి), రాకేష్ (కోడంగల్), బుస్స శ్రీకాంత్ (వికారాబాద్), పెంటయ్య గుప్త (పరిగి), కోశాధికారులుగా పోకల సతీష్ (వికారాబాద్), జిల్లా కార్యాలయ కార్యదర్శి యాదగిరి (వికారాబాద్), జిల్లా అధికార ప్రతినిధిగా జుంటుపల్లి వెంకట్(తాండూరు), అయినాపూర్ యాదయ్య(పరిగి), కిసాన్ మోర్చ్ జిల్లా అధ్యక్షులుగా సంజీవరెడ్డి(తాండూరు), బీసీ మోర్చ్ జిల్లా అధ్యక్షులుగా బొప్పి శ్రీహరి(తాండూరు), మైనార్టీ మోర్చ జిల్లా అధ్యక్షులుగా జాకీర్ జహీర్ అబ్బాస్ లను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!