ఫార్మసీ నిరుద్యోగులకు శుభ వార్త..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఫార్మసీ నిరుద్యోగులకు శుభ వార్త..!
– 15న వికారాబాద్‌లో జాబ్ మేళా
– ప్రకటించిన జిల్లా ఉపాధి కల్పన అధికారి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని ఫార్మసీ నిరుద్యోగులకు అధికారులు శుభవార్త చెప్పారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి షేక్ అబ్దుల్ సుభాన్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. ఈనెల 15న ఉదయం 10:30 గంటలకు వికారాబాద్ పట్టణంలో నిరుద్యోగ యువతకు ఫార్మసీ రంగంలో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం వద్ద అపోలో ఫార్మసీ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో సుమారు 150 ఫార్మసీ ఉద్యోగాల కొరకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అర్హులైన అభ్యర్థులను కంపెనీ నిర్వాహకులు జాబ్ మేళా ద్వారా ఎంపిక చేసుకుంటారని స్పష్టం చేశారు. ఫార్మసిస్టులు, ఫార్మసి అసిస్టెంట్లు, అసిస్టెంట్లు, ట్రైనీల పోస్టులకు కనీస విద్యార్హతలు బి – ఫార్మసీ, యం – ఫార్మసీలతో పాటు పదో తరగతి పాస్, ఇంటర్, డిగ్రీ ఉండాలన్నారు. అర్హులైన యువతి యువకులు ఈనెల15 ( గురువారం) నిర్వహించు జాబ్ మేళాకు యువత అధిక సంఖ్యలతో తరలివచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జాబ్ మేళా నిర్వాహకులు మియా సాబ్ 9676047444నకు సంప్రదించవచ్చని తెలిపారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!