హుండీ దొంగ రిమాండు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

హుండీ దొంగ రిమాండు
– వివరాలు వెల్లడించిన కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : దేవాలయంలో హుండీ దొంగతానికి పాల్పడిన నిందితున్ని పోలీసులు రిమాండుకు తరలించారు. తాండూరు మండలం వీరారెడ్డి పల్లి గ్రామంలోని వీరభద్రేశ్వర దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కరణ్ కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా నిందితున్ని గుర్తించారు. తాండూరు మండలంలోని మిట్టబాస్పల్లి గ్రామానికి చెందిన రాథోడ్ సంతోష్ నాయక్ ఆర్థరాత్రి ఆలయంలో ఉన్న హుండీలో డబ్బును దొంగించాడు. ఇతను కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా తమ విచారణలో నిందితుడు హుండీ దొంగతనం నేరాన్ని అంగీకరించినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!