నో డౌట్.. బీజేపీ గెలుపు పక్కా..!
– కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను నమ్మొద్దు
– కేంద్ర మంత్రి బీఎల్ వర్మ
– పొత్తు పెట్టుకుంటే చెప్పుతో కొట్టండి
– బీజేపీతో రాముడు, మోడి – కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో రాక్షసులు
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
– తాండూరులో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో బీజేపీ, ప్రధాని మోడి గెలుపు పక్కా అని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ అన్నారు. ఆర్టీకల్ 370ని రద్దు చేసిన మోడీ ప్రభుత్వానికి 370 సీట్లు గెలిపించి ఇవ్వాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం నుంచి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి బీఎల్ వర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డిలు హాజరై బీజేపీ రాజ రాజేశ్వర బస్సు(విజయ సంకల్ప) యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి బీఎల్ వర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పేదల కోసం చేయలేకపోయారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోడి పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పీఎం కిసాన్, ఆయూస్మాన్ భారత్, ఉజ్వల వంటి పథకాలతో పాటు ఉచిత బియ్యం పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. దీంతో అయోధ్యలో రామ మందిర నిర్మాణం, రాముని విగ్రహ ప్రతిష్టాపన చేసిందన్నారు. ఇచ్చిన హామిలను నెరవేర్చిన బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడంతో పాటు మోడీ మూడో సారి ప్రధాని కావాలనే ఉద్దేశంతో విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. మోడీ సర్కారుకు అందరు. అండగా నిలవాలని, కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టాలన్నారు.
పొత్తు పెట్టుకుంటే చెప్పుతో కొట్టండి
అనంతరం బహిరంగ సభలో బండి సంజయ్ పార్లమెంట్ ఓడిపోతామనే భయంతో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే తప్పుడు ప్రచారాన్ని తెరలేపారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకోలేదని, ఇప్పుడు ఓడిపోయిన పార్టీలో పొత్తు ఎలా పెట్టుకుంటుందన్నారు. అలాంటి సందర్భం ఎదురైతే చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ వెంట అయోధ్య రాముడు, మోడీ ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వెంట రాక్షసులు ఉన్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని సంచలన వాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ పై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, కృష్ణ జలాల అప్పగింతపై రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటూ టైపాస్ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. దేశంలో 370 ఆర్టీకల్ రద్దు చేసిన బీజేపీకీ 370 సీట్లు రావడం పక్కా అన్నారు. తెలంగాణలో అన్ని పార్టీల పని ఖతమైనట్లే అని రాష్ట్రంలో 17 సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.
ఉత్సహాంగా బస్సు యాత్ర
అనంతరం చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు కొనసాగే రాజ రాజేశ్వరి బస్సు యాత్రను కేంద్ర మంత్రి బీఎల్ వర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు ప్రారంభించారు.

తాండూరు పట్టణం నుంచి ధారూర్ మీదుగా ఈ బస్సు యాత్ర ఉత్సహాంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ నాయకురాలు రాణి రుద్రమ, జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, సీనీయర్ నాయకులు యు.రమేష్ కుమార్. ఎం. నరేష్ మహరాజ్, గాజుల శాంతుకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు బాలి శివకుమార్. అంతారం లలిత. జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, కౌన్సిలర్ సాహు శ్రీలత, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

