రమేష్ మహరాజ్‌కు శుభాకాంక్షల వెల్లువ
– సన్మానించిన బీసీ, ముదిరాజ్ సంఘం నాయకులు
– అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం (స్టేట్ ఫైనాన్స్ కమీషన్) సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహరాజ్ కు పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం తాండూరు పట్టణంలోని సిండికేట్ కార్యాలయంలో బీసీ సంఘం నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు సన్మానించారు. స్టేట్ ఫైనాన్స్ కమీషన్ మెంబర్ గా ఎం.రమేష్ మహరాజ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, ముదిరాజ్ సంఘం నాయకులు ఉత్తమ్ చంద్, నర్సింలు, ఎస్పీ రవి, లొంక నర్సింలు, రాము ముదిరాజ్, నరేందర్, జగదీష్, బాలప్ప, శ్రీనివాస్, రాజ్ కుమార్, తిరుపతి తదితరులు శుభాంకాక్షలు తెలిపి భారీ గజమాలతో సన్మానించారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, చెన్నారం అనిల్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కూడా సన్మానించి శుభాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎం. రమేష్ మహరాజ్ స్టేట్ ఫైనాన్స్ కమీషన్ మెంబర్ గా తనదైన ముద్ర వేయాలని, రానున్న రోజుల్లో మరిన్ని సదవులు పొందాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి…

