వికలాంగులకు తోడ్పాటు అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిపర్ క్యాంపు కరపత్రం అవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికలాంగుల అంగవైకల్యాన్ని దూరం చేసేందుకు తాండూరు మార్వాడి యువమంచ్, ఆర్బీఎల్ ఫ్యాక్టరీ అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మార్వాడి యువమంచ్, జక్కెపల్లి రాడికల్ బయో-ఆర్గానిక్ లిమిటెడ్ ఫ్యాక్టరీ(ఆర్బీఎల్) ఆధ్వర్యంలో వచ్చేనెల 11నుంచి పట్టణంలోని బాలాజీ మందిర్లో లో నిర్వహిస్తున్న ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిఫర్ పరికరాల అమరిక శిబిరానికి సంబంధించిన కరపత్రాన్ని శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు తోడ్పాటు అందించేలా ఉచిత జైపూర్, కెలిఫర్ కాళ్ల అమరిక శిభిరం ఏర్పాటు చేయడం అభినందనీమన్నారు. ఈ శిబిరాన్ని అంగవైకల్యం కలిగిన వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు మార్వాడి యువమంచ్ ప్రతినిధులు మాట్లాడుతూ వచ్చే నెల 11, 12, 13వ తేదిల్లో బాలాజీ మందిరంలో జైపూర్ కాళ్లతో పాటు కెలిపర్ పరికరాల అమర్చడం జరుగుతుందన్నారు. ముందుగా అంగవైకల్యం కలిగిన వికలాంగుల నుంచి కొలతలు తీసుకోవడం జరుగుతుందని, 200ల మందికి ఈ సేవలను అందించడం జరుగుతుందన్నారు.
శిభిరానికి వచ్చే వికలాంగులు తమవెంట ఆధార్కార్డు, అంగవైకల్యం కలిగిన రెండు పాస్ఫోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకరావాల్సి ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్, సాయిపూర్ బాల్ రెడ్డి, మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, కుంజ్, బిహారి సోని, రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్ని అగ్రవాల్, తాండూరు అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ రాఠి, కోశాధికారి ఆరుణ్ సార్డా, క్యాంపు చైర్మన్ కరణ్ జైన్, సభ్యులు సంజయ్ సోని, అనిల్ సార్డా, అశిష్ సార్డా, లక్ష్మీనారాయణ బూబ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..

