బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!
– కాంగ్రెస్ పార్టీలో చేరిన కేపీఆర్
– సీఎం రేవంత్ సమక్షంలో చేరిక
– పార్టీని వీడిన మరికొందరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గాని(ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాత వర్గం)కి చెందిన సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు(కేపీఆర్) కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవేళ్లలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కరణం పురుషోత్తంరావుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కరణం పురుషోత్తం రావుతో పాటు యాలాల పీఏసీఎస్ మాజీ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరికొందరు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గంలో ఉన్న కరణం పురుషోత్తంరావు, సిద్రాల శ్రీనివాస్ లు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంలో కలిసి పనిచేశారు.
ఇది కూడా చదవండి..

