లంచం అడిగితే ఏసీబీకి ప‌ట్టించండి

క్రైం తాండూరు వికారాబాద్

లంచం అడిగితే ఏసీబీకి ప‌ట్టించండి
– తాండూరు మున్సిప‌ల్‌లో పోస్ట‌ర్ అతికించిన అధికారులు
తాండూరు, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నులు జ‌ర‌గాలంటే ఎవ‌రైనా లంచం ఇచ్చుకోవాల్సిందే. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం.. కాని ఇందుకు భిన్నంగా తాండూరు మున్సిప‌ల్ కార్యాయంలో అధికారులెవ‌రైనా లంచం అడిగితే అవినీతి నిరోధ‌క శాఖ(ఏసీబీ)కు ప‌ట్టించాల‌ని పోస్ట‌ర్‌ల‌ను అతికించారు. గురువారం మున్సిప‌ల్ మేనేజ‌ర్ బుచ్చిబాబు త‌న కార్యాల‌యంతోపాటు రెవెన్యూ విభాగం వద్ద ద‌గ్గరుండి ఈ పోస్ట‌ర్ల‌ను అతికించారు.
అందులో లంచం ఇవ్వ‌డం – లంచం తీసుకోవ‌డం చ‌ట్ట‌రిత్యా నేరం అనే సూక్తితో పాటు మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఎవ‌రైనా లంచం అడిగితే ఏసీబీ ప‌ట్టించాల‌ని రాయించారు. ప్ర‌త్యేకంగా ఏసీబీ శాఖ ఫోన్‌నెంబ‌ర్ 040-2351555, 23559023, సెల్: 944044106కు ఫిర్యాదు చేయాల‌ని కూడ రాయించారు. కార్యాల‌యంలో ఈ పోస్ట‌ర్‌ను చూసిన ప్ర‌జ‌లు అధికారుల చ‌ర్య‌ల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేశారు.