గోశాల నూతన అధ్యక్షులుగా బాల్ రెడ్డి
ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులు
ప్రధాన కార్యదర్శిగా కోట్రికె కిరణ్, కోశాధికారిగా మన్మోహన్ సారడా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు గోశాల సేవా సమితి నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. బుధవారం రాత్రి గోశాల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షులుగా పట్లోళ్ల బాల్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా గోశాల నూతన ప్రధాన కార్యదర్శిగా కోట్రికె కిరణ్, కోశాధికారిగా మన్మోహన్ సారడాను ఎన్నుకున్నారు. నూతన కార్యకవర్గం రెండేళ్ల పాటు పదవిలో ఉంటుంది. ఏప్రిల్ ఒకటి నుంచి నూతన కార్యవర్గం బాధ్యతలు చేపడుతుందని గోశాల ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

