బీజేపీ ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులుగా బొప్పి శ్రీహరి
– జిల్లా కార్యవర్గం, అసెంబ్లీ కన్వినర్ల ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులుగా తాండూరు పట్టణానికి చెందిన బొప్పి శ్రీహరి ఎన్నికయ్యారు. మంగళవారం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు బొప్పి శ్రీహరి తెలిపారు. ఉపాధ్యక్షులుగా నరేందర్ సింగ్ ఠాకూర్(కోడంగల్), చిట్లపల్లి శ్రీకాంత్(దోమ), ఎం.మహిపాల్(పెద్దేముల్), చిన్న మల్లికార్జున్(చౌడాపూర్), ప్రధాన కార్యదర్శులుగా ఎం.వెంకటేశం (యాలాల), శ్రీశైలం(పరిగి), కార్యదర్శులుగా శ్రీకాంత్(ధారూర్), నవీన్ (బషీరాబాద్), కాసుల శ్రీనివాస్(పరిగి), గోపాల్ (వికారాబాద్), అసెంబ్లీ కన్వినర్లుగా భానుతేజ(తాండూరు), ప్రవీణ్ కుమార్(వికారాబాద్), విజయ్ కుమార్ (పరిగి)లను ఎన్నుకున్నట్లు తెలిపారు. కొత్త కార్యవర్గం పార్టీ పటిష్టతో పాటు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు.
ఇదికూడా చదవండి…

