బెధిరించి బాలికపై అత్యాచారం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బెధిరించి బాలికపై అత్యాచారం..!
– బెడిసి కొట్టిన ఆటో డ్రైవర్ ప్లాన్
– తల్లి ఫిర్యాదులో కేసు నమోదు
– రిమాండుకు తరలించిన పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మాయ మాటలతో బాలికను నమ్మించిన ఆటో డ్రైవర్ బెధిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉండేందుకు వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడు కటకటాల పాలయ్యాడు. తాండూరు మండలంలో జరిగిన సంఘటనపై కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఓ ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తోంది. మండలంలోని ఐనెల్లి గ్రామానికి చెందిన బూడిద అంబేష్ తన ఆటోలో ప్రతి రోజు వస్తున్న బాలికతో సన్నిహితం పెంచుకున్నాడు.

ఈనెల 4వ తేది గురువారం తాండూరు పట్టణంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో స్నేహితురాలి పెళ్లికి వెళ్లిన విషయం తెలుసుకున్న అంబేష్ కూడా అదే పెళ్లికి వెళ్లాడు. బాలికను కలిసి ఇంటివద్ద దింపుతానని చెప్పి తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఐనెల్లి గ్రామ శివారులోని తన పొలం వద్దకు తీసుకెళ్లాడు. బాలికను చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయం బాలిక ఎవరికైనా చెబుతుందేమో అని ఆమెను శుక్రవారం ఉదయం 5 గంటలకు తాండూరు రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కించాడు. జరిగిన విషయాన్ని బాలిక తన అమ్మకు, అమ్మమ్మకు తెలిపింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు చేయగా అంబేష్ ను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ ఆద్వర్యంలో నిందితుడు అంబేష్ను రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

ఇదికూడా చదవండి…

తుక్కుగూడ సెంటిమెంట్‌ రీపీట్..!