తాండూరులో వాలిన రెక్కల పురుగులు
– విద్యుత్ లైట్ల చుట్టూ చక్కర్లు
– ముఖాల మీదకు రావడంతో ఇబ్బందులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆదివారం ఈక రెక్కల పురుగులు అతిథుల్లా వాలిపోయాయి. భారీ ఎత్తున గుంపులుగా దర్శనమివ్వడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మూకుమ్మడిగా దర్శనమీయడంతో వామ్మో ఇదేం పురుగులు సామీ అంటూ ప్రజలు, వాహనదారులు హతాశయానికి గురయ్యారు. ఆదివారం చీకటి పడిన తరువాత తాండూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి.
మున్సిపల్ వీది దీపాలకు ఈ కరెంటు పురగులు ఎగబడ్డాయి. చీకటి పడిన తరువాత ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కాని, ఎక్కడ లైట్లు ఉంటే అక్కడ భారీ ఎత్తున వాలిపోయాయి. పలు వ్యాపార దుకాణాల వద్ద కూడా ఈ పురుగులు ఇబ్బంది పెట్టాయి. రోడ్డుపై వెళుతుండగా లైట్ల వెలుగులో దూసుకవచ్చి వాహనదారులను అవస్థల పాలు చేశాయి.
ఇదికూడా చదవండి…

