దటీజ్ లీడర్..!
– ఓటింగ్‌లో పాల్గొన్న నేతలు
– తాండూరులో ఓటేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– ఫ్యామీలీతో పాటు ఓటువేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– స్వగ్రామంలో ఓటేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయాల్లో నేతలంటే స్పూర్తిదాయకంగా నిలవాలని తాండూరు నేతలు నిరూపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నేతలు ఓటింగ్‌లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. గురువారం జరిగిన పార్లంఎట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని కేంద్రంలో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సతీమణి అరుణ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి సాయిపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓటు వెశారు.
తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బషీరాబాద్ మండలం స్వగ్రామైన ఇందర్ చెడ్ లో అతని సతీమణి ఆర్తి రెడ్డి, తల్లి జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, తండ్రి విఠల్ రెడ్డి, బాబాయి శ్రీశైల్ రెడ్డిలతో కలిసి ఓటు వేశారు. మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునితా మహేందర్ రెడ్డి యాలాల మండలంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ భర్త పరిమళ్ గుప్తతో కలిసి తాండూరు పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ ఆర్డీఓ కార్యాలయ వెనుక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వియోగించుకున్నారు.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి, గోశాల అధ్యక్షులు సాయిపూర్ బాల్ రెడ్డిలు సాయిపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వారితో పాటు పట్టణానికి చెందిన కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, రాజకీయ నేతలు, ప్రముఖులు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదికూడా చదవండి…

