పోలీసులపై గొడ్డలితో దాడి..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పోలీసులపై గొడ్డలితో దాడి..!
– ముగ్గురు నిందితుల రిమాండ్
– పరారిలో మరో నిందితుడు
– వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ అశోక్ కుమార్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు. మరో నిందితుడు పరారిలో ఉన్నట్లు తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం మీడియా ప్రకటనలో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన నర్సింలు, మాల రాంచందర్, మాల విజయ్ కుమార్, పెద్దేముల్ మండలం నాగులపల్లి జుట్టు పవన్ కుమార్లు యాలాల మండలంలో ఓ ఫంక్షన్కు వెళ్లి వస్తున్నారు.

మార్గమద్యలో బాగాయిపల్లి చౌరస్తాలో రెండు బైకులు ఢీకొనడంతో ఘర్షణ జరిగింది. అక్కడే విధుల్లో ఉన్న బ్లూకోట్ పీసీలు నరేష్, వెంకటేష్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన కారులను సముదాయిస్తున్నారు. అదే సమయంలో నర్సింలు, పవన్, రాంచెందర్, విజయ్ కుమార్లు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువురి మద్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. వారు మద్యం సేవించారని పరీక్షలు చేసేందుకు వెళ్లగా వారు ఘర్షణ పడ్డారు. రాంచెందర్ నరేష్ కాని స్టేబుల్ నుంచి బ్రీత్ అనలైజర్ ను గుంజుకుని దాడి చేసేందుకు యత్నించాడు.

నరేష్ తప్పించుకోగా నర్సింలు తలకు తగిలి రక్తగాయాలయ్యాయి. దీంతో నర్సింలు మిషన్ ను ద్వంసం చేశారు. కానిస్టేబుళ్లపై వారు దాడి చేయడంతో గాయాలయ్యాయి. పవన్ అనే వ్యక్తి అక్కడే ఉన్న మహిపాల్ అనే వ్యక్తి నుంచి గొడ్డలిని తీసుకుని పోలీసులపై దాడి చేసేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు అడ్డుకున్నారు.

దీంతో నిందితులపై కేసు నమోదు చేయడంతో పాటు విచారణ అనంతరం జుట్టు పవన్. రాంచెందర్, విజయ్ కుమార్ లను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. నర్సింలు అనే నిందితుడు పరారిలో ఉన్నట్లు తెలిపారు. దాడి చేసిన గొడ్డలిని, ద్వంసం చేసిన బ్రీత్ అనలైజ్ మిషన్ను స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. మరోవైపు పోలీసులే దాడి చేశారని నర్సింలు మీడియాకు తప్పుడు సమాచారం అందించారని తెలిపారు.

ఇదికూడా చదవండి…

వాహ్‌.. వైష్ణవి..!