
ఓరీ.. పాపాత్ముల్లారా..!
– కట్ట మైసమ్మ దేవాలయంలో చోరీ
– సీసీ కెమెరాలను పగుల గొట్టిన దుండగులు
– దొరికినకాడికి దోచుకుని హుడాయింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దోచుకునే వారికి ఇళ్లేంటీ..? గుడులేంటీ..? అని దోపిడి దొంగలు మళ్లీ నిరూపించారు. ఏకంగా అమ్మవారి దేవాలయంలోనే చోరీకి పాల్పడి దొరికినకాడికి దోచుకెళ్లారు. బుధవారం తాండూరు పట్టణం ఆదర్శనగర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మున్సిపల్ పరిధిలోని ఆదర్శనగర్‌లో కట్టమైసమ్మ దేవాలయం ఉంది. ఇప్పుడిప్పుడే దేవాలయం అభివృద్ధికి నోచుకుంటుంది.

అయితే గుర్తుతెలియని దుండగులు అమ్మవారి దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. ఆలయ గర్భగుడిలో అమ్మవారి మెడలోని పుస్తే, మెట్టెలు దోచుకున్నారు. అదేవింధంగా హుండీని ద్వంసం చేసి అందిన కాడికి అపహరించుకున్నారు. అంతకుముందే దేవాలయంలోని సీసీ కెమెరాలను పగులగొట్టి దొంగతనానికి తెగబడినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగులు ద్వంసం చేసిన సీసీ పుటేజీ హర్డ్ డెస్క్‌ను స్వాదీనం చేసుకుని దొంగల వేట ప్రారంభించారు. అమ్మవారి దేవాలయంలో దుండగులు చేసిన పనికి ఓరి పాపాత్ముల్లారా అంటూ అమ్మవారి భక్తులు శాపనార్థనాలు పెడుతున్నారు.

ఇదికూడా చదవండి…

