
డర్టీ డంపింగ్ క్లీన్..!
– యార్డులో చెత్త కుప్పల తొలగింపు
– ప్రైవేటు జేసీబీతో పరిశుభ్ర పనులు
– దర్శిని న్యూస్ కథనానికి స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : దర్శిని న్యూస్ కథనానికి తాండూరు మున్సిపల్ అధికారులు స్పందించారు. డర్టీగా మారిన మున్సిపల్ డంపింగ్ యార్డులో చెత్త కుప్పల తొలగింపు పనులు చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా డంపింగ్ యార్డు దయనీయంగా మారిన దుస్థితి దర్శిని న్యూస్లో ఆర్టీకల్ వచ్చింది.

పట్టణం నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో కుప్పలు కుప్పలుగా నిల్వ చేశారు. అలా పేరుకు పోయిన చెత్త కుప్పలు డంపింగ్ యార్డు ప్రధాన గేటు బయటకు వచ్చాయి. అక్కడితో ఆగకుండా చెత్త చెప్పలను గేటు బయట ఉన్న అటవిశాఖ భూమిలో డంపింగ్ చేశారు. ఈ విషయాలపై బుధవారం దర్శిని న్యూస్ కథనం వచ్చింది. అదే రోజు నుంచి అధికారులు స్పందించి ప్రైవేటు జేసీబీ యంత్రంతో చెత్త తొలగింపు పనులు చేపట్టారు. ముందుగా డంపింగ్ యార్డు లోపలి భాగంలో పేరుకుపోయిన చెత్త కుప్పలను పూర్తిగా వెనక్కి నెట్టి వేశారు. యార్డు లోపలి ప్రధాన భాగంలో కుప్పలను పూర్తిగా తొలగింపు చేయించారు.

గురువారం కూడా చెత్త తొలగింపు పనులు కొనసాగించారు. అయితే లోపలి భాగంలో చెత్త కుప్పలను తొలగించినప్పటికి గేటు బయటి చెత్త కుప్పలు అలాగే ఉండిపోయాయి. వీటిని కూడా ప్రత్యేక ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డు లోపలికి తరలించి పూర్తిగా పరిశుభ్రం చేయించడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

