రుతుపవనాల ఆగమనం..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

chai jr
రుతుపవనాల ఆగమనం..!
– వారం ముందే తాకిన నైరుతి
– తెలంగాణలో రేపటి నుంచి వర్షాలు
– ప్రకటించిన వాతావరణ శాఖ
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోకి రుతుపవనాల ఆగమనం జరిగింది. గతంలో కంటే ఈ సారి వారం ముందుగానే రుతుపవనాలు తెలంగాణను తాకాయి. నాలుగు రోజుల క్రితం మే 30న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిన్న కర్ణాటక మీదుగా ఏపీలోని రాయలసీమలోకి ఎంటర్‌ అయ్యాయి. ఇవాళ తెలంగాణను తాకాయి. నాగర్‌కర్నూలు, గద్వాల, నల్గొండ మీదుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు చరుగ్గా కదులుతున్నాయి.

ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలుచోట్లు సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మంగళవారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌ నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ సారి రుతుపవనాలు ముందే రావడంతో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.


ఇదికూడా చదవండి…

కౌంటింగ్‌ టెన్షన్‌..!