సర్కారు బడిలో నాణ్యమైన విద్య..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrసర్కారు బడిలో నాణ్యమైన విద్య..!
– పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
– గాంధీనగర్‌ కౌన్సిలర్ సంగీత ఠాకూర్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రవేటు స్కూళ్లలో కంటే సర్కారు బడుల్లోని పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని, పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్చించాలని తాండూరు మున్సిపల్ గాంధీనగర్‌ బీఆర్ఎస్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ సూచించారు. శుక్రవారం వార్డులో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ సంగీత ఠాకూర్ సర్కారు బడి విద్యపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్లు ధీటుగా విద్యనందిస్తున్నారని అన్నారు. ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలన్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి, పాఠశాల చైర్మన్ ఓ బి లలిత, ఉపాధ్యాయురాలు రాణి, అంగన్వాడి టీచర్ రాధ, వార్డ్ స్పెషల్ ఆఫీసర్ రాములు, ఆర్పీ శోభ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రండి… ఆస్వాదించండి..!