
జెడ్పీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
– రంగం సిద్దం చేస్తున్న అధికారులు
– ప్రకటించిన జిల్లా కలెక్టర్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డిపై అవిశ్వాసంకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హాట్రిక్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన సునితా మహేందర్ రెడ్డి లోక్‌సభ ఎన్నికలకు ముందుకు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

బీఆర్ఎస్ పార్టీని వీడి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17వ తేదిన 12 మంది జెడ్పీటీసీలు సునీతా మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టాలని తీర్మానించారు. ఈ తీర్మానాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు అందజేశారు. అవిశ్వాసానికి జాప్యం జరగడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా లోక్‌సభ ఎన్నికలు రావడంతో అవిశ్వాస నిర్ణయం వాయిదా పడింది. తాజాగా ఎన్నికలు పూర్తి కావడంతో జెడ్పీ చైర్ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం మళ్లీ తెరమీదకు వచ్చింది.

జెడ్పీ చైర్ పర్సన్‌పై అవిశ్వాసంకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా తీసుకునే నిర్ణయంపై జెడ్పీ సీఈఓకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీంతో జెడ్పీ చైర్ పర్సన్‌పై పెడుతున్న అవిశ్వాస తీర్మానం అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి….

